ఖమ్మంలో ‘పవర్ పెట్రోల్’ మంట.. వాహనదారుల జేబులకు చిల్లులు

కలం, ఖమ్మం బ్యూరో : అమెరికా – ఇరాన్​ యుద్ధం సామాన్యుల నడ్డివిరుస్తోంది. జిల్లాలొని పెట్రోల్​ బంకులు కృత్రిమ కొరతను చూపి నార్మల్ పెట్రోల్ లేదని చెబుతూ బంకుల యజమానులు పవర్​ పెట్రోల్ అంటగడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే, పవర్​ పెట్రోల్​ వల్ల వాహనదారులకు లీటర్ పెట్రోల్ పై రూ.10 లు అదనపు భారం పడుతుంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాహనాదారుల జేబులకు చిల్లు పెడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో పవర్ పెట్రోల్ వ్యాపారాన్ని బంకు యజమానులు సజావుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బంక్ లోకి పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులకు నార్మల్ పెట్రోల్ లేదని, బంక్ లో వర్కర్లు చెప్పడంతో చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్లలేక.. ఎక్కువ రేటు అని తెలిసినా పవర్ పెట్రోలు పోయించు కోవాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఒక్క బంక్ లో నార్మల్ పెట్రోల్ లేదంటే పర్వలేదనుకోవచ్చు.. కానీ అన్ని పెట్రోల్ బంక్ లలో ఇదే తంతు కొనసాగడమెంటనీ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

ప్రధానంగా పాండురంగపురంలోని హెచ్ పి, భారత్ రెండు పెట్రోల్ బంక్ లలో కూడా పవర్ పెట్రోల్ దందా నడుస్తోందని స్థానికులు వాపోతున్నారు. పవర్ పెట్రోల్ పోయించుకున్న వాహనదారులకు పాయింట్లు తగ్గడంతో పాటు డబ్బులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని అన్ని బంక్ లలో పవర్ పెట్రోల్ పేరుతో పెట్రోల్ బంకు యజమానులు ఇబ్బందులకు గురి చేయండం విస్మయం కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా నార్మల్ పెట్రోల్ దిగుమతి చేసుకోకుండా, బంక్ ల యజమానులు ఇలాంటి ధోరణికి తెర లేపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సివిల్ సప్లై అధికారులు బంక్ లు తనిఖీ చేసి, నార్మల్ పెట్రోల్ స్టాక్ వివరాల పై ఆరా తీయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>