భారీ ధరకు ఆర్సీబీని కొన్న ఆదిత్య బిర్లా గ్రూప్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ స్టార్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) మేనేజ్ మెంట్ చేతులు మారింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆదిత్యబిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా నాయకత్వంలో ఉన్న కన్సార్టియం ఆర్సీబీ (RCB) జట్టును యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.16,896 కోట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక డీల్ కు ఆర్సీబీ అమ్ముడు పోయింది. ఈ కన్సార్టియంలో బిర్లా గ్రూప్ తో పాటు అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ David Blitzer, Blackstone, అలాగే The Times Group కూడా ఉన్నాయి.

ఆర్సీబీ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.15,300 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆర్సీబీని United Spirits Limited సంస్థ 2008లో రూ.446 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఈ జట్టు విలువ 18 ఏళ్లలో 16 రెట్లు పెరిగింది. ఇక కొత్త యాజమాన్యం ఈ 2026 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత బాధ్యతలు చేపట్టబోతోంది. 2025లో ఆర్సీబీ మొదటిసారి టైటిల్ గెలిచింది. ఈ సారి కూడా టైటిల్ గెలవాలని ప్రయత్నిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>