మహమ్మద్ యూనస్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి!

కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. బుధవారం అర్థరాత్రి ఛట్టోగ్రామ్ లోని ఆయన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నిషేధంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాడి చేసిన దుండగులను ఇంకా గుర్తించలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన జరిగినట్లు పంచ్లైష్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మొజామెల్ హక్ ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Also Read : రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరే: మహేష్​ కుమార్ గౌడ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>