కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కలకలం రేపింది. అంబర్ పేటలోని ఓ హోటలో కల్తీ, అపరిశుభ్ర ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. అంబర్ పేటలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న ముక్రమం హోటల్ లో కొనుగోలు చేసిన బిర్యానీని ఓ ఫ్యామిలీ తిన్నది. కొద్దిసేపటికి వారు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే వారు ఆస్పత్రికి పరుగులు తీశారు.
మెరుగైన చికిత్స కోసం వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులను అలర్ట్ చేశారు. సదరు హోటల్ పై అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినా హోటల్ నిర్వాహకులు మారడం లేదు. కల్తీ, అపరిశుభ్ర ఆహారం, పరిసరాలతో ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Also Read : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్!
Follow Us On : WhatsApp

