దమ్ముంటే సొంత పార్టీ పెట్టుకోండి.. రాజగోపాల్ రెడ్డికి డీసీసీ చీఫ్​ సవాల్!

‎కలం, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత (Punna Kailash Netha) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక యాదవ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ.. “పార్టీలో ఉండాలంటే పద్ధతిగా ఉండండి, లేదంటే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోండి. దమ్ముంటే మీ సొంత నాయకత్వంలో కొత్త పార్టీ పెట్టుకుని నడిపించుకోండి” అని రాజగోపాల్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు.

కాంగ్రెస్‌లో ఉంటూనే సొంత పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం సరికాదని, చెట్టు కింద ఉంటూ అదే చెట్టును నరికితే నష్టపోయేది ఎవరో ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనో, కాంట్రాక్టులు దక్కలేదన్న అసంతృప్తితోనో సొంత ప్రభుత్వాన్ని రోడ్డుకీడ్చడం తగదని పున్న కైలాష్ నేత విమర్శించారు. “ఒకవేళ డిసెంబర్‌లో మంత్రి పదవి వస్తే, ఇప్పటివరకు మీరు చేసిన విమర్శలన్నీ మాఫీ అవుతాయా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని, అది రాజగోపాల్ రెడ్డి అయినా, తాను అయినా ఒక్కటేనని డీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. పార్టీ సహనానికి ఒక హద్దు ఉంటుందని, గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహారశైలిపై పూర్తి ఆధారాలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు పున్న కైలాష్ నేత (Punna Kailash Netha) వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : చంద్రబాబుకు లొంగిపోయిన రేవంత్: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>