epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్ పల్స్ సర్వే..

కలం, డెస్క్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నేటితో కంప్లీట్ అయింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ (Exit Poll) బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పీపుల్స్ పల్స్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీదే హవా అని చెప్పింది. ఆ తర్వాత బీఆర్ ఎస్, బీజేపీలు ఎక్కువ వార్డులను కైవలం చేసుకుంటాయని వెల్లడించింది.

మున్సిపాలిటీల్లో చూస్తే..

116 మున్సిపాలిటీలకు గాను.. కాంగ్రెస్ పార్టీ 68-76 మున్సిపాలిటీలు గెలుస్తుందని తెలిపింది పీపుల్స్ పల్స్. అలాగే బీఆర్ ఎస్ పార్టీ 29-36 మున్సిపాలిటీలు, బీజేపీ 3-5 మున్సిపాలిటీలు, ఎంఐఎం 0-1 మున్సిపాలిటీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. 8-14 మున్సిపాలిటీల్లో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

వార్డుల పరంగా..

మున్సిపాలిటీల్లో వార్డుల పరంగా చూసినా కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 1210-1290 వార్డులు, బీఆర్ ఎస్ పార్టీ 860-930 వార్డులు, బీజేపీ 250-270 వార్డులు, ఎంఐఎం 35-44 వార్డులు, సీపీఐ 12-17 వార్డులు, సీపీఎం 10-14 వార్డులు, ఇతరులు 90-110 వార్డులు గెలిచే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది.

కార్పొరేషన్ల పరంగా..

7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ ఖాతాలో, రెండు బీజేపీ ఖాతాలో పడుతాయని అంచనా వేసింది. రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని.. కరీంనగర్, నిజమాబాద్ మాత్రం బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్నట్టు అంచనాలు వేసింది.

Read Also: రాహుల్​ రాగానే ఇంటర్వ్యూ ఆపేసిన కేంద్ర మంత్రులు ​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>