కలం, వెబ్ డెస్క్: కొంతమంది జనాలకు ఫ్రీగా వస్తే దేన్నీ కాదనరు.. అది మంచిదా.. చెడుదా అని కూడా ఆలోచించరు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మరీ దారుణం. ఫ్రీగా పంచిపెడితే అసలు వివరాలు కూడా తెలుసుకోకుండా తీసుకుంటూనే ఉంటారు. కానీ, ఓ చోట తాము తీసుకునే ఫుడ్ కల్తీ అని తెలిసినా తినేందుకు వెనుకాడకపోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వీట్ షాపులపై దాడులు చేశారు. ఈ క్రమంలో డేట్ అయిపోయిన, కల్తీ స్వీట్ల (Adulterated Sweets)ను గుర్తించారు. షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసి చేసి ఆ స్వీట్లను సీజ్ చేసి చెత్తకుండీ (Garbage)లో పడేశారు. ఇక్కడే ఆసక్తికర సీన్ జరిగింది. అధికారులు చెత్తకుండీలో స్వీట్లు పడేసి వెళ్లగానే స్థానికులు కొందరు ఆ చెత్త కుండీల వద్ద గుమిగూడారు. ఒకరి తర్వాత ఒకరు చెత్తకుండీలో పడేసిన స్వీట్ బాక్సులను ఏరుకున్నారు. ఆ స్వీట్లు ఆరోగ్యానికి హానికం అని తెలిసినా తినేందుకు తీసుకోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనం మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

