కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్–జాన్వీ కపూర్ కాంబోలో బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రం జూన్ 4వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతుండగా.. ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మొదట ట్రైలర్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించాలని భావించినా.. నార్త్ ఆడియన్స్ టార్గెట్ కారణంగా.. మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో విడుదల చేయాలని ఫిక్సయ్యారట. కేవలం.. ట్రైలర్ ఈవెంట్ మాత్రమే కాకుండా, మ్యూజిక్ కన్సర్ట్ షో లా డిజైన్ చేస్తున్నారట. మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ స్వయంగా స్టేజీ ఫర్‌ఫార్మన్స్ ఇవ్వబోతున్నారట.
అదిరిపోయేలా ట్రైలర్ కట్..
బుచ్చిబాబు ఈ మూవీ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేయించినట్లు సమాచారం. రామ్ చరణ్‌ను ఏలివేట్ చేస్తూనే.. యాక్షన్స్ సీన్స్ హైలైట్ చేసేలా ఉంటుందని టాక్. రెండు మూడు రకాల ట్రైలర్స్ కట్ చేసి, అందులో ఒకటి ఫైనల్ చేశారట. సుకుమార్ దగ్గరుండి.. ఈ ట్రైలర్ కట్ చూసి సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా.. అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

