Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్ ప్లేయర్లకు పీసీబీ వార్నింగ్.. కాంట్రాక్ట్‌కు కొత్త రూల్

కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ( PCB) స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దేశవాళీ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు ఇకపై సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వబోమని తెలిపింది. జట్టు ప్రదర్శనను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వెల్లడించింది. ముఖ్యంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచాలని భావిస్తోంది. ఇటీవల టెస్టు క్రికెట్‌తో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ పాకిస్థాన్ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి గాను పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న ఏ, బి, సీ, డి కేటగిరీల స్థానంలో ఐదు ట్రాక్‌ల విధానాన్ని తీసుకొచ్చింది. టెస్టులు, వన్డేలు ఆడే వారికి ట్రాక్ ఏ, బి, టెస్టు స్పెషలిస్టులకు ట్రాక్ ఏ, వన్డే-టీ20 ఆటగాళ్లకు ట్రాక్ బీ, సీ, టీ20, ఫ్రాంఛైజీ క్రికెటర్లకు ట్రాక్ సీ కేటాయించారు. హైపర్‌ఫార్మెన్స్ అకాడమీలో శిక్షణ పొందే ఆటగాళ్లకు ట్రాక్ డి కాంట్రాక్టులు ఇవ్వనున్నారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ ప్రకారం, దేశవాళీ ఫస్ట్‌ క్లాస్ టోర్నీల్లో పాల్గొనని ఆటగాళ్లు ఇక నుంచి సెంట్రల్ కాంట్రాక్టులకు అర్హులు కారు. కొత్త విధానానికి వైట్‌ బాల్ కోచ్ మైక్ హసన్ కూడా మద్దతు తెలిపాడు. వరుస నిరాశల తర్వాత జట్టును మళ్లీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో పీసీబీ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>