కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ మరోసారి తన సత్తా చాటుకుంది. లక్నో సూపర్ జయింట్స్‌తో జరిగిన మ్యాచ్ (PBKS vs LSG)లో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్లు, బౌలర్లు మైదానంలో వీరవిహారం చేశారు. బ్యాటర్లలో ప్రియాంష్, కనోలీ దెబ్బకు లక్నో బౌలర్లు బెంబేలెత్తారు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు లక్నో బ్యాటర్లు కట్టడి చేశారు. పంజాబ్ గెలిచినప్పటికీ ఆ జట్టు ఫీల్డింగ్‌లో అనేక మైనస్‌లు ఈ మ్యాచ్‌లు బయటపడ్డాయి. ఏది ఏమైనా లక్నోపై పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తామంటే ఏంటో నిరూపించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించి ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయినా, ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లోనే 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు బాది సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. అతనికి తోడుగా కూపర్ కనోలీ 46 బంతుల్లో 87 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి పరుగుల వరద పారించాడు. మిడిల్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 29 పరుగులు చేయగా, శశాంక్ సింగ్ (17), నేహల్ వధేరా (13) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 5 పరుగులకే పరిమితమయ్యాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. అయితే షమీ తన 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐడెన్ మార్క్రామ్ (42), మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (35) తమ వంతు ప్రయత్నం చేసినా రన్ రేట్ పెరిగిపోవడంతో లక్ష్యానికి దూరంగా ఆగిపోయారు. చివర్లో ముకుల్ చౌదరి 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలింగ్ విభాగంలో మార్కో జాన్సెన్ అత్యుత్తమంగా 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చహల్ తలో వికెట్ పడగొట్టి లక్నోను నియంత్రించారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు దొర్లినా, భారీ స్కోరు అండతో పంజాబ్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

