కేసీఆర్‌ రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే పాయం

కలం, ఖమ్మం బ్యూరో : కేసీఆర్‌ ఫామ్‌హౌస్ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, లేనిపక్షంలో పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateshwarlu) అల్టిమేటం జారీ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే ప్రతిపక్ష నేత పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని తేల్చిచెప్పారు. ​కేసీఆర్‌ వైఖరిని నిరసిస్తూ ఆదివారం మణుగూరులో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టాయి.

క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీతో మణుగూరు పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. అనంతరం ప్రధాన రహదారిపై గంటల పాటు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రజలు మీకు ఓటేసింది ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడానికి కాదు.. సభలో ప్రజా గొంతుకగా నిలబడటానికి” అని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారం అనుభవించి ప్రతిపక్షంలోకి రాగానే ముఖం చాటేయడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు.

​ప్రతిపక్ష నేత పదవి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, సభకు రాకుండా బయట ఉండి రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, కేసీఆర్‌ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని అసెంబ్లీకి రావాలన్నారు. లేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ మండల, టౌన్, యూత్, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>