పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బిగ్ స్టేట్‌మెంట్: కూటమికి హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం సుస్థిరంగా, బలంగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అయితే అదే సమయంలో జనసేన పార్టీ ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ మిత్రపక్షాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ఎవరి గౌరవం తగ్గకుండా, భాగస్వామ్య పక్షాల స్వయం మర్యాదను కాపాడుకుంటూ ముందుకు సాగడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో స్థానిక పార్టీ యంత్రాంగం వైఖరిపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో జనసేన (Janasena) కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని, నాయకుల్లో ఒకరకమైన ఉదాసీనత పెరిగిపోతోందని మండిపడ్డారు. అధికారం రాగానే స్థానిక నేతలు చల్లబడ్డారని, అయితే వారిని తిరిగి ఎలా చురుగ్గా మార్చాలో, బాధ్యతాయుతంగా పనిచేసేలా ఎలా చేయాలో తనకు బాగా తెలుసని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సమీక్షించి, పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

పార్టీని పునర్నిర్మించి, స్థానిక సమస్యలపై నిరంతరం దృష్టి సారించేందుకు గాను తన క్యాంప్ ఆఫీస్‌ను పిఠాపురాని(Pithapuram)కి మార్చాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. పిఠాపురం నుంచే పరిపాలన, పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా నాయకులకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పార్టీని సరికొత్త వ్యూహాలతో ముందుకు తీసుకెళ్లడంతో పాటు, స్థానికంగా నెలకొన్న లోపాలను సరిదిద్ది జనసేనను మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.

Also Read : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>