Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు జూబ్లీహిల్స్‌లో పవన్ కీలక ప్రెస్‌మీట్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) నేడు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌మీట్ (Press Meet) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఈ మీడియా సమావేశం జరగనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో జనసేన పార్టీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ పలు కీలక అంశాలపై మీడియాతో మాట్లాడనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే, ప్రెస్‌మీట్ నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ నుండి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదని పవన్ కల్యాణ్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>