చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూనే.. మరోవైపు జనసేన పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ఎవరైనా హద్దు మీరితే అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే జనసేన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తాజాగా స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ తమ పార్టీ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటే, భవిష్యత్తులో మరింత రాణించవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం స్థానిక ఎన్నికల్లో ఊహించనివిధంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబుని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్డు మీదకు రాలేదు.. కానీ జనసైనికులు వచ్చారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుర్తు చేశారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలలో.. మా జనసేన పార్టీనే చాలా త్యాగం చేసింది అన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

Also Read : హోప్ చేసిన తప్పు అదే: అశ్విన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>