హోప్ చేసిన తప్పు అదే: అశ్విన్

కలం, స్పోర్ట్స్ : భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) అవలంబించిన బౌలింగ్ వ్యూహంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోప్ చేసిన అతిపెద్ద తప్పు ఒకటేనని పేర్కొన్నారు. “పవర్‌ప్లేలో స్పిన్నర్‌తో వరుస ఓవర్లు వేయించడం ఆకలిగా ఉన్న సింహానికి మేకను నైవేద్యంగా అందించడమే” అంటూ అశ్విన్ తీవ్రంగా స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో రెండో టీ20 మ్యాచ్‌పై విశ్లేషణ సందర్భంగా విండీస్ కెప్టెన్ వ్యూహాలను తప్పుపట్టారు.

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 41 బంతుల్లోనే 82 పరుగులు చేసి అదరగొట్టాడు. విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ వేసిన మూడు ఓవర్లలోనే శాంసన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో 46 పరుగులు పిండుకున్నాడు. అకీల్ హొసేన్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నప్పటికీ, అతనితోనే పదేపదే ఓవర్లు వేయించడాన్ని అశ్విన్ తప్పుపట్టారు.

ఫామ్‌లో లేని స్పిన్నర్‌ను శాంసన్ వంటి బ్యాటర్‌కు ఎదురుగా కొనసాగించడం పెద్ద పొరపాటని అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహం భారత బ్యాటర్‌కు బాగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు, జట్టులో తన స్థానంపై అనిశ్చితి ఉన్నప్పటికీ సంజూ శాంసన్ భయపడకుండా రిస్క్ తీసుకుని ఆడిన తీరును అశ్విన్ ప్రశంసించారు. ఒత్తిడిని పక్కనపెట్టి దూకుడుగా బ్యాటింగ్ చేయడం ద్వారా శాంసన్ తన సత్తా చాటాడని విశ్లేషించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>