పంజాబ్​ రైతులను నిండా ముంచిన వర్షం!

క‌లం, వెబ్‌డెస్క్‌: పంజాబ్‌ (Punjab) లో ఆదివారం తెల్లవారుజామున భారీ వ‌ర్షం (Heavy Rains) కురిసింది. మాల్వా ప్రాంతంలోని ఫాజిల్కా, బటిండా వ‌ద్ద కురిస‌న‌ వ‌డ‌గండ్లు, వాన‌కు మార్కెట్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న లక్షలాది మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నీటిలో తడిసిముద్దయింది. మార్కెట్లలో సుమారు 3 అడుగుల మేర వర్షపు నీరు నిలవడంతో ధాన్యం కుప్పలు నీటిపై తేలియాడాయి. దీని వల్ల పంటలో తేమ శాతం పెరిగి కొనుగోళ్ల సమయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనేక చోట్ల మార్కెట్ల వద్ద ధాన్యం భ‌ద్ర‌త‌కు స‌రైన వ‌సతులు లేక‌ రైతన్నలే స్వయంగా తమ ఇళ్ల నుంచి కవర్లు తెచ్చి పంటను కాపాడుకోవాల్సి వచ్చింది. ఈ అకాల వర్షం వల్ల పొలాల్లో కోత పనులు నిలిచిపోయాయి. కొనుగోలు ప్రక్రియ సుమారు ఒక వారం పాటు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స‌రిప‌డా టార్పాలిన్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Also Read : స‌ముద్రంలో ప‌డ‌వ బోల్తా.. 109 మంది మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>