కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గోవా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సాయంత్రం గోవా రాజధాని పనాజీలో జరిగే గోయ్ రాఖోన్న్ యాత్ర(Goy Rakhonn Yatra)లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. గోవా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో ఈ యాత్ర ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములు, పర్యావరణాన్ని రక్షించుకోవడం, సంసృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో 27 రోజుల పాటు 40 నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర సాగించారు. ఈ నెల 18న ముగియబోతుండగా.. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై బహిరంగ సభలో పాల్గొంటారు. అదే సమయంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా గోవా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలపై కూడా మాట్లాడబోతున్నారు.
రాత్రికి ఢిల్లీకి ప్రయాణం..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు సాయంత్రం గోవాలోని పనాజీలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అది ముగిసిన వెంటనే రాత్రి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. రేపు ఉదయం హై కమాండ్ నిర్వహించే సమావేశానికి హాజరయ్యారు. దీని కోసం ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, అందరూ మంత్రులు, పార్టీ కీలక నేతలు ఢిల్లీ బాట పట్టారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. సర్ ప్రక్రియ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేయాల్సిన ఆందోళనలపై హై కమాండ్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.
Also Read : పోరాటం ఆపబోం.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన
Follow Us On: Instagram

