మ‌త‌ విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌కండి.. సీఎం విజ‌య్‌పై ఖుష్బు ఫైర్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: అధికారం ఉంది కదా అని మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని, టీవీకే ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకునేలా చూడాల‌ని సీఎం విజ‌య్‌ (CM Vijay)పై బీజేపీ నాయ‌కురాలు ఖుష్బు సుందర్ (Khushbu Sundar) ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో స‌నాత‌న ధ‌ర్మంపై జ‌రుగుతున్న రాజ‌కీయ ర‌చ్చ‌పై ఖుష్బు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ ముస్తాఫా స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఒక మ‌తాన్ని, లేదా న‌మ్మ‌కాన్ని నిర్మూలించాల‌ని మాట్లాడ‌టం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. తాను ముస్లింగా ఉండి, ఇస్లాంను నిర్మూలించాలంటే అంగీక‌రిస్తారా? అని ఖ‌ష్బు ప్ర‌శ్నించారు. అలాగే క్రైస్త‌వం గురించి ఎవ‌రైనా మాట్లాడితే సీఎం ఊరుకుంటారా? అని నిల‌దీశారు. మెజారిటీ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌ను గౌర‌వించాల‌ని, రాజ‌కీయాల కోసం మ‌త‌ప‌ర‌మైన విభ‌జ‌న తీసుకురావ‌ద్ద‌ని ఆమె కోరారు.

మ‌రోవైపు డీఎంకే నేత ఉద‌య‌నిధి స్టాలిన్‌ను ఉద్దేశించి ఖుష్బు (Khushbu) ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. స‌నాత‌న ధ‌ర్మంపై విమ‌ర్శ‌లు చేసే ఉద‌య‌నిధి (Udhayanidhi Stalin) త‌న సొంత కుటుంబంలోని మ‌హిళ‌లు ఆల‌యాల‌కు వెళ్ల‌డంపై, హిందూ సాంప్ర‌దాయాలు పాటించ‌డంపై ఎందుకు ప్ర‌శ్నించ‌ర‌ని నిల‌దీశారు. అలాగే కొత్త‌గా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేల‌ను అదుపులో పెట్టుకోవాల‌ని సీఎం విజ‌య్‌కు సూచించారు. అన‌వ‌స‌ర‌పు విష‌యాల‌పై స‌మ‌యం వృథా చేయ‌కుండా పాల‌న‌పై , ఇచ్చిన హామీల‌పై దృష్టి సారించాల‌న్నారు.

Read Also: ప్రధాని పిలుపు.. కేసుల విచారణపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>