త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు : మంత్రి లోకేష్

కలం, వెబ్ డెస్క్ : పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన వేళ జరిగిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు. కూటమి పాలనలో రాయలసీమ మరింత అభివృద్ధి కాబోతుందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు .. ముగ్గురికీ 75 ఏళ్లు అయినా.. 25 ఏళ్ల కుర్రాళ్లలా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రస్తావించారు. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేస్తారని వివరించారు. కరువు నేలపై కార్ల తయారీ పరిశ్రమలతో పాటు ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలను కూడా తెచ్చామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయన్న మంత్రి.. 23 నెలల్లో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏంటో చూపించామని చెప్పుకొచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>