పవన్ కల్యాణ్ నా ముందే కోట్లు దానం చేశాడు : హరీష్‌ శంకర్

కలం, డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజల కోసం కోట్లు దానం చేశాడని.. అందుకు తాను కూడా సాక్ష్యమే అన్నారు డైరెక్టర్ హరీష్‌ శంకర్. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్‌ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీ సెకండ్ సాంగ్ ను తాజాగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో రిలీజ్ చేశారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అంటూ సాంగ్ లిరిక్స్ సాగాయి. ఈ సందర్భంగా హరీష్‌ కాసేపు స్టూడెంట్లతో ముచ్చటించారు.

అనంతరం హరీష్‌ మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్‌ ప్రజల కోసం కోట్ల రూపాయలు వదులుకున్నాడని చెప్పారు. పవన్ కల్యాణ్‌ కు డబ్బు మీద ఆశలేదని.. అవసరం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా సాయం చేస్తారని చెప్పారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఉంటుందని.. అంచనాలు తప్పడం ఈ సారి జరగదని చెప్పుకొచ్చారు హరీష్‌ శంకర్. ఉస్తాద్ కోసం పవన్ చాలా కష్టపడ్డారని.. అందుకే తగ్గట్టే ఫలితం ఉంటుందన్నారు హరీష్‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>