అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నేత మృతి

కలం, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత (BRS Leader)  తిర్మణి రమణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు మల్యాల వరద కాలువలో పడిపోయింది. స్థానికులు గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదంటే హత్యా? ఆత్మహత్యా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సుద్ధపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణ గతంలో పెగడపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా పనిచేశారు. స్థానికంగా చురుకైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబ సభ్యులు, అనుచరులను షాక్‌కు గురి చేసింది.

స్థానికుల సమాచారం మేరకు మల్యాల వరద కాలువలో ఒక కారు పడిపోయినట్లు గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయంతో కాలువలో ఉన్న కారును బయటకు తీశారు. కారులోనే తిర్మణి రమణ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>