పవన్ కళ్యాణ్​ పై దారుణమైన కామెంట్స్.. స్టాండప్ కమెడియన్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : వినోదం పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Katikala)ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫోన్ స్విచ్  ఆఫ్​ చేసుకుని పరారైన అనుదీప్ ఆచూకీని టెక్నాలజీ సాయంతో  పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక పార్కులో తన తల్లిదండ్రులతో ఉండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనుదీప్ కటికాల తన స్టాండప్ కామెడీ షోలలో భాగంగా చేసిన “The Tollywood Roast Show” వీడియో యూట్యూబ్‌లో విడుదలైన తర్వాత పెను దుమారం రేగింది. ఈ వీడియోలో అతను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ వ్యక్తిగత జీవితం,వివాహాలపై.. మెగా డాటర్ నిహారిక కొణిదేల విడాకులపై అసభ్​యకరంగా ప్రస్తావించారు. వీటితో పాటు నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్‌లను కూడా కించపరిచేలా వ్యాఖ్యానించారు. కేవలం ‘రోస్టింగ్’ ఫార్మాట్ పేరుతో సెలబ్రిటీల, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడంతో తెలుగు రాష్ట్రాల్లో అనుదీప్ పై నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ తో పాటు మెగా, నందమూరి అభిమానులు ఫిర్యాదుతో కాకినాడ పోలీసులు రంగంలోకి దిగారు. మహిళలను కించపరచడం, వ్యక్తిత్వ హననం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో అనుదీప్ ఇప్పటికే సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుపోయింది. ‘నవ్వించడం అంటే ఎదుటివారిని కించపరచడం, బూతులు తిట్టడం కాదు’ అంటూ ఈ ఘటనపై పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>