Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన(JanaSena) పోటీపై ఉత్కంఠకు తెర ప‌డింది. ఎన్నిక‌ల్లో బీజేపీ(BJP)కి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి పవన్ కల్యాణ్ తో ఆయ‌న నివాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ‌ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీకి ప‌వ‌న్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా బీజేపీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొంటాన‌ని ప‌వ‌న్‌ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఫిబ్రవరి 6వ తేదీన పలు చోట్ల పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>