‘పట్టించుకోవడం లేదు’.. ప‌టాన్‌చెరు కాంగ్రెస్ నాయ‌కుల అసంతృప్తి!

కలం, మెదక్ బ్యూరో: అధికార పార్టీలో ఉన్నా.. త‌మ మాట అధికారుల వ‌ద్ద‌ చెల్లుబాటు కావడం లేద‌ని సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు  నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అసంతృప్తికి లోన‌వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డిన కార్య‌కర్త‌ల‌కు త‌మ ప్ర‌భుత్వ హ‌యంలో క‌నీస గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని వాపోతున్నారు.

ఏళ్లుగా పటాన్ చెరు ప్రాంతంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల చెందిన కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు.. ఇంకా ప్ర‌తిప‌క్ష‌ బీఅర్ఎస్ నాయ‌కులతో చెట్టాప‌ట్టాల్ వేసుకొని తిరుగుతున్న‌ర‌ని విమ‌ర్శిస్తున్నారు. క్షేత్ర‌స్ధాయిలో పార్టీని ప‌టిష్టం చేద్ద‌మంటే అధికారుల నుండి స‌హ‌కారం లేకుండా పోతుంద‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై అగ్ర‌హం

సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఅర్ఎస్ పార్టీ త‌రుపున గూడెం మ‌హిపాల్ రెడ్డి హ్య‌ట్రిక్ విజ‌యం సాధించింది . కాంగ్రెస్ తరుపున పోటి చేసిన ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌సుత్త ఇంచార్జి కొన‌సాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెల‌వ‌క పోయినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో హ‌స్తం శ్రేణులు సంతోష‌పడ్డారు. త‌మ ప్ర‌భుత్వం హ‌యంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిధులు తీసుకువ‌చ్చి .. క్షేత్ర‌స్ధాయిలో త‌మ బ‌లం పెంచుకొవ‌డంతో పాటు, పార్టీని బ‌లోపేతం చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారు.

త‌మ కాల‌నీల‌లో ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రం ,మౌలిక వ‌స‌తుల కోసం విన‌తుల‌తో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు దగ్గ‌రికి వెళ్లి నిధులు మంజూరు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ వివిధ శాఖ‌ల ప్ర‌భుత్వ అధికారులు ..కాంగ్రెస్ క్యాడ‌ర్ తో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు డీలా ప‌డిపోతున్నారు. అధికారులు తీరుతో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు తీసుకువచ్చినా పనులు, నిధులను బీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేస్తుందని చెబుతున్నారు.

అమీన్‌పూర్ లాంటి విస్తరిస్తున్న ప్రాంతాల్లో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి, మౌలిక వసతులు కోసం నిధులు మంజూరు అవుతున్నాయి.
నిధులు మంజూరు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్వయంగా సంబంధిత మంత్రిని, జోనల్ కమిషనర్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రమతో పనులు మంజూరు చేయించగా, తీరా పనుల ప్రారంభ సమయానికి వచ్చేసరికి అధికారులు వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

రోడ్డు మంజూరైన తర్వాత పనుల ప్రారంభ సమాచారాన్ని మంజూరుకు కార‌ణ‌మైన స్ధానిక కాంగ్రెస్ నాయ‌కులుకు క‌నీస స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్నారు. అమీన్ పూర్ మున్సిప‌ల్ శాఖ ఉన్న‌తాధికారి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే సమాచారం అందిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి రోడ్డు మంజూరు చేయించిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వారిని తీవ్రంగా అవమానపరుస్తున్నారని మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ నాయ‌కుల‌తో చెట్టప‌ట్టాల్..

ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు శాఖ‌ల‌కు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా మున్సిపాల్ ,పోలిస్ శాఖ‌కు చెందిన అధికారులు ఏళ్ళుగా ఇక్క‌డే తిష్ట వేశారు. ముఖ్యంగా అమీన్ పూర్ స‌ర్కిల్ కు చెందిన మున్సిపాల్ అధికారుల వైఖ‌రిపై కాంగ్రెస్ నాయకులు, కార్య‌క‌ర్త‌లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు, అధికారులు చుట్టు తిరిగి ప‌నులు మంజూరు చేయించి, వ‌ర్క్ టెండ‌ర్స్ పూర్తి అయిన కుడా పనులు ప్రారంభం కావడం లేదు.

ఎందుకు ప‌నులు మొద‌లు పెట్ట‌డం లేద‌ని సంబంధిత కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే.. స‌దరు మున్సిపాల్ ఉన్న‌తాధికారి వర్క్ ఆర్డర్లు ఇవ్వడం లేదని, అగ్రిమెంట్లపై సంతకాలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కాంట్రాక్టర్లు వెల్లడించినట్లు సమాచారం. కావాలనే త‌మ‌కు సంబంధించిన‌ పనులను ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ నాయకత్వాన్ని, కార్యకర్తలను ప్రజల ముందు చిన్నచూపు చూపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

అమీన్ పూర్ లో గత ఆరు సంవత్సరాలుగా మున్సిపాల్ లో విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉన్న‌తాధికారి పూర్తిగా బీఆర్ఎస్ నాయకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అరోపిస్తున్నారు. ఏ ప‌ని మంజూరు అయినా కాంగ్రెస్ నాయ‌క‌లకు స‌మాచ‌రం ఇవ్వ‌కుండా, బీఅర్ఎస్ పార్టీకి చెందిన‌ మాజీ కౌన్సిలర్ల చేత ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాడ‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

గతంలోనూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి మార్పు రాలేదని, అ అధికారి తీరు మార‌లేద‌ని పేర్కొంటున్నారు. బీఅర్ఎస్ ప్ర‌భుత్వం నుండి అమీన్ పూర్ లోనే విధులు నిర్వ‌హిస్తున్న కొందరు అధికారులు.. వారి బీఅర్ఎస్ పాల‌న‌లో జ‌రిగిన‌ అక్ర‌మాలు, అవినీతిలో భాగం ఉండ‌టంలో పాటు, వారి మ‌ధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల వల్లే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

ప‌ట్టించుకునే నాధుడే లేడు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప‌టాన్ చెరువు నియోజకవర్గంలో తమకు కనీస విలువ లభించడం లేదని స్థానిక క్యాడర్ నారాజ్‌లో ఉంది. ముఖ్యంగా నియోజ‌క‌వర్గ ఇంచార్జి ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ మంత్రులు ప‌ర్య‌ట‌న‌లు, రాష్ట్ర పార్టీ కార్య‌క్ర‌మాల‌లో త‌ప్ప, ప్ర‌భుత్వంను ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేసే కార్య‌క్ర‌మాల‌ను తీసుకొవ‌డంలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇంచార్జిగా కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన ప‌నులు చేయాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌కు చెప్పి చేయించ‌వ‌ల్సిన శ్రీనివాస్ గౌడ్ పెద్ద‌గా పట్టించుకొవ‌డం లేద‌నే ప్ర‌చారం ఉన్న‌ది.

బీఅర్ఎస్ అనుకూలంగా ఉన్న అధికారుల వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భుత్వం, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి.. బ‌దిలీ కుడా చేయించ‌లేక పోతున్న‌డ‌ని అనుకుంటున్నారు. స‌హ‌క‌రించ‌ని అధికారులు గురించి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు దృష్టి తీసుకువెళ్లిన పెద్ద ప్ర‌యోజ‌నం లేద‌ని అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల మాటలను సైతం లెక్కచేయకుండా, కేవలం బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లే వింటున్న అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ అనుకూల అధికారులను ఇక్కడి నుండి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఫిర్యాదులు చేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు దగ్గ‌ర‌గా ప్ర‌భుత్వం వెళ్లాలంటే కార్య‌క‌ర్త వార‌ధిగా ఉంటాడ‌ని, కానీ అధికారుల వ‌ద్ద‌ కార్య‌క‌ర్త‌లకే విలువ లేక‌పోతే, జ‌నాలు ఏం లెక్కచేస్తారని అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే వ్య‌వ‌హ‌ర శైలి కొన‌సాగితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్రంగా న‌ష్ట‌పోతమ‌ని చెబుతున్నారు. అధికారుల ప‌ట్ల అల‌స‌త్వంగా ఉండ‌టం, కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిల‌వ‌క‌పొవ‌డంతోనే మున్సిపాల్ ఎన్నిక‌ల్లో అన్ని స్ధానల్లో ఓడిపోయ‌మ‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ప‌టాన్ చెరు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి, పార్టీని త‌ద్వార ప్ర‌భుత్వాన్ని బ‌లోపేతం చేయాల‌ని కొరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>