కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులుగా పాల్గొనడం అసలైన విజయమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ (Obedullah Kothwal) అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో 70వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ (అండర్-17 బాలురు, బాలికలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తినిస్తుందని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా క్రీడా విద్యను ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో తప్పనిసరిగా పాల్గొనాలని ఒబేదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా తమ గ్రామానికి, పట్టణానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరినీ అభినందిస్తూ, విజేతలకు ,రన్నరప్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఎస్ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్, హ్యాండ్‌బాల్ టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, మహబూబ్‌నగర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శాంత, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, పెటాటీబీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్గౌడ్, హ్యాండ్‌బాల్ కోచ్ విశ్వవర్ధన్, ఎం.డి. జియావుద్దీన్, బాలరాజు, అనిల్‌కుమార్, మునిబర్ రహమాన్, ప్రదీప్‌కుమార్, అబ్షర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

