కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ (Parkal Municipality) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 13 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి కావాల్సిన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబురాల్లో మునిగిపోయారు.


