Mobile Popup Ad
Mobile Popup Ad

పారిస్‌లో మద్యం సేవించడంపై నిషేధం.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: పారిస్ (Paris) రికార్డుస్థాయి ఎండలతో అల్లాడిపోతోంది. దీంతో అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ వీధులు, పార్కుల్లో మద్యం సేవించడాన్ని పారిస్ పోలీసులు తాత్కాలికంగా నిషేధించారు. శాంతిభద్రతల సమస్యల కాకుండా.. మానవ శరీరంపై వాతావరణ ప్రభావం, జీవక్రియల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఆసుపత్రులు ఇప్పటికే రోగులతో నిండిపోయాయని, అంబులెన్స్‌లకు రోజుకు సాధారణం కంటే రెట్టింపుగా దాదాపు 2,500 అత్యవసర పిలుపులు వస్తున్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నేరుగా సూర్యరశ్మిలో మద్యం సేవించడం వల్ల యువతతో సహా పలువురు గుండెపోటుకు గురవుతున్నారని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలాంటి కేసులు నాలుగు రెట్లు పెరిగాయని ఆరోగ్య మంత్రి స్టెఫానీ రిస్ట్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల కారణంగా వారాంతంలో మద్యం (Alcohol) నిషేధంతో పాటు క్రీడా పోటీలు, ప్రైడ్ మార్చ్, సంగీత ఉత్సవాలను కూడా రద్దు చేశారు. వడగాల్పుల సమయంలో మద్యం సేవించడం ప్రాణాంతకంగా మారడానికి ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం వేగంగా పడిపోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎండ తీవ్రతకు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మన శరీరం లీటర్ల కొద్దీ చెమటను బయటకు పంపుతుంది. దీనికి తోడు మద్యం ‘డైయూరిటిక్’గా పనిచేస్తుంది. దీంతో మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. అలాగే జీవక్రియల లోపం వల్లే ఎండలో మద్యం తాగడం ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>