కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. హాస్టల్‌లో ఉంటున్న తమ కూతురి కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా గడిపారు. హాస్టల్ ఆవరణలో కూర్చొని ఆ చిన్నారికి తల్లిదండ్రులు భోజనం తినిపించారు. పాప స్కూల్ పుస్తకాలకు అట్టలు వేస్తూ ఆ క్షణాలను సంతోషంగా పంచుకున్నారు.
“ఆదివారం వస్తే ఇంత సంతోషంగా ఉంటుందా?” అంటూ ఆ తల్లిదండ్రులు కనబరిచిన భావోద్వేగాలు చూసే ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. చదువుల కోసం పిల్లలను దూరంగా ఉంచుతున్న తల్లిదండ్రుల నిరీక్షణను, వారి మధ్య ఉన్న బంధాన్ని ఈ వీడియో కళ్లకు కడుతోంది.
హాస్టల్‌లో కూతురు.. పేరెంట్స్ ఎమోషనల్
-నార్సింగి గురుకుల హాస్టల్‌లో ఉన్న బిడ్డ కోసం వచ్చిన అమ్మానాన్న
-దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్!
Heartwarming Sunday Video of Parents Visiting Daughter at Narsingi Gurukul School Goes Viral#Narsingi #GurukulSchool #ViralVideo… pic.twitter.com/DfB5tOjxl6— Kalam Daily (@kalamtelugu) July 10, 2026

