కలం, వెబ్ డెస్క్: ఆషాఢం బోనాలకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ నెల 16 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గోల్కొండలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) నేడు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులపై ఆరా తీశారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వాన్ని రూ.20 కోట్ల నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. స్థానికంగా పారిశుద్ధ్యం , భద్రత, షీ టీమ్స్, అత్యవసర సేవల పరంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ బోనాలు గంగా-జమునా తెహజీబ్కు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి ఆగస్ట్ 13 వరకు గోల్కొండ బోనాలు (Golconda Bonalu) జరుగుతాయని, లక్షలాది మంది ప్రజలు అమ్మవారి దర్శనానికి వస్తారని మంత్రి (Konda Surekha) తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, నీరు, వైద్యం, పరిశుభ్రత, శివసత్తులకు ప్రత్యేక సహాయ సహకారాలు కల్పించాలని సూచించారు. బోనాల వేడుకలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Read Also: పండ్లు, కూరగాయలు తాకితే కొనాల్సిందే.. ఈ వింత రూల్ ఎక్కడో తెలుసా?
Follow Us On : WhatsApp

