హరీశ్.. పదేళ్లు ఏం చేశావ్?: మహేశ్ కుమార్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: తనకు మూడు నెలలు మంత్రి పదవి కావాలంటున్న హరీశ్ రావు.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. ఆయన తమ పార్టీలోకి వస్తానంటే.. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి రంగాన్ని నాశనం చేయడమే కాకుండా.. మరో మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే చక్కదిద్దుతానంటూ చెబుతున్నారని మండిపడ్డారు.

కవిత ఆరోపణలు నిజమే..

బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్ల నిధులు ఉన్నాయంటేనే ఆశ్చర్యంగా ఉందని పీసీసీ చీఫ్ అన్నారు. కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేశారంటున్న కవిత ఆరోపణల్లో నిజం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలను పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ఉందన్నారు.

జేపీ నడ్డా ఎన్ని ఉద్యోగాలిచ్చారు..?

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. “ఉద్యోగ నియామకాల్లో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు రాలేవు. అసలు జేపీ నడ్డా ఎన్ని ఉద్యోగాలిచ్చారు. మోదీ హయాంలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో సరిపోల్చండి. అప్పుడు ఎంతో మంది పేదలు లబ్ధి పొందారు. తెలంగాణలో బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు” అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>