స్కూల్ బస్ ఆలస్యం.. ప్ర‌శ్నించిన‌ పేరెంట్స్‌పై దాడి!

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) పట్టణంలో నారాయణ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను తీసుకెళ్లే స్కూల్ బస్సు రోజు ఆలస్యంగా వస్తుంద‌ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై స్కూల్ సిబ్బంది దాడికి పాల్ప‌డ్డారు. స్కూల్ బ‌స్సు ఆల‌స్యంగా వ‌స్తోంద‌ని, డ్రైవ‌ర్ వ్య‌వ‌హార శైలి బాగా లేద‌ని ప‌లుమార్లు పేరెంట్స్ ఫిర్యాదులు చేశారు. అయితే తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్కూల్‌ ప్రిన్సిపాల్ ప‌ట్టించుకోలేద‌ని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నేరుగా డ్రైవ‌ర్‌నే ఈ అంశంపై నిల‌దీసినందుకు త‌మ‌పై దాడి చేసి, బెదిరింపుల‌కు గురి చేశాడ‌ని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కార‌ణంగానే కింది స్థాయి సిబ్బంది ఇంత దారుణానికి పాల్ప‌డ్డార‌ని చెప్తున్నారు. ఈ సంద‌ర్భంగా పేరెంట్స్ పాఠ‌శాల‌కు వ‌చ్చి ఆందోళన చేయ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌మ‌పై దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read Also: కవిత ఇంటికి సీబీఐ ఆఫీసర్లు.. నోటీసులు అందుకున్న భర్త

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>