ముంబై ఇండియన్స్‌కు మాంబ్రే గుడ్‌బై

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్‌ 2027కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ కోచింగ్‌ బృందంలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే (Paras Mhambrey) పంజాబ్‌ జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను వీడిన ఆయనతో పంజాబ్‌ కింగ్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మాంబ్రే తొలుత రాజస్థాన్‌ రాయల్స్‌తోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌తో ఆయన చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్‌ 2027కు ముందు జట్టులో చేరే అవకాశం ఉంది. మాంబ్రే 2021 చివరి నుంచి 2024 జూన్‌ వరకు భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో ఆయన సేవలందించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ విజయంతో ఆయన టీమిండియా కోచింగ్‌ ప్రయాణం ముగిసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ కోచింగ్‌ బృందంలోకి తిరిగి వెళ్లాడు. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ కూడా కోచింగ్‌ సిబ్బందిలో మార్పులు చేస్తోంది. బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌ జట్టును వీడారు. స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే కూడా ఐపీఎల్‌ 2026 తర్వాత భారత జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో మాంబ్రేను తీసుకోవాలని పంజాబ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>