epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆక్షన్ లో సర్పంచ్ పదవి.. ఎంతంటే..?

Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. నేరుగా పంచాయతీ ముందే సభ ఏర్పాటు చేసి పదవుల కోసం వేలం పాట నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారిదే సర్పంచ్ పీఠం. అయితే ఈ వేలం పాటలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు సర్పంచ్ లను ఎన్నుకోవాలని.. అంతేగానీ వేలం పాట సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికల సంఘం కూడా ఈ పద్ధతిని తప్పు పడుతోంది. తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఇదిలా ఉంటే తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం అయ్యింది.

11 మంది అభ్యర్థులు సర్పంచ్‌ పదవికి నామినేషన్‌లు దాఖలు చేశారు. దీంతో తీవ్ర పోటీ కనిపించింది. కానీ ఇంతలోనే గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు సమావేశమై గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం, శానిటేషన్, రహదారుల మరమ్మతులు వంటి పనుల కోసం భారీగా నిధులు సమకూర్చే అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. సర్పంచ్ పదవికి గ్రామ పెద్దల సమక్షంలో వేలంపాట నిర్వహించారు.

Panchayat Elections | వేలంలో మహమ్మద్‌ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో మిగతా 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకుంటామని అంగీకరించారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రంపై అందరూ సంతకాలు కూడా చేశారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also: హిడ్మా చనిపోయిన వారానికే… చత్తీస్‌గఢ్ సర్కార్ సంచలన నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>