కలం, వెబ్ డెస్క్: అండర్-19 ఆసియా కప్(U19 Asia Cup)ను పాకిస్థాన్ (Pakistan) సొంతం చేసుకుంది. తుదిపోరులో దాయాది దేశాలు భారత్, పాక్ తలపడ్డాయి. అప్పటి వరకు అప్రతిహతంగా వచ్చిన భారత్.. ఫైనల్‌లో చేతులెత్తేసింది. దీంతో పాక్ టీమ్.. కప్‌ను గెలిచుకుంది. ఆసియా కప్‌ను గెలుచుకున్న పాకిస్తాన్ అండర్-19 జట్టుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించారు. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి పాకిస్థాన్ రూపాయలు 5 మిలియన్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
భారత్‌తో జరిగిన ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందని నక్వీ ప్రశంసించారు. ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన సమీర్ మిన్హాస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఫైనల్‌లో పాకిస్థాన్(Pakistan) జట్టు భారత్‌పై 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత జట్టు 26.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తరఫున అలీ రజా నాలుగు వికెట్లు సాధించారు.
Read Also: రిటైర్మెంట్ ప్లాన్స్‌పై కేన్ విలియమ్స్ క్లారిటీ
Follow Us On: Youtube


