పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్ ఖరారు!

కలం, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా పాకిస్థాన్ టూర్‌ (Pakistan vs Australia)కు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మూడు వన్డే మ్యాచ్‌లు కూడా లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలోనే జరిగే అవకాశం ఉంది. మే 31న మొదటి వన్డే జరగనుంది. ఆ తర్వాత జూన్ 2న రెండో వన్డే, జూన్ 4న మూడో వన్డే నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. అయితే దీనిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సిరీస్ ఖరారైతే 2022 తర్వాత ఆస్ట్రేలియా జట్టు వన్డేలు ఆడేందుకు పాకిస్థాన్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. గత పర్యటనలో పాకిస్థాన్ 2-1తో సిరీస్‌ గెలుచుకుని ఆసీస్‌కు షాకిచ్చింది.

రికార్డుల పరంగా చూస్తే ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన 111 వన్డేల్లో ఆస్ట్రేలియా 71 సార్లు గెలవగా, పాకిస్థాన్ 36 సార్లు విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం పాకిస్థాన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఆస్ట్రేలియాతో తలపడకముందే పాక్ జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27)లో భాగంగా జరగనుంది. మరోవైపు, పాకిస్థాన్ పర్యటన ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. అక్కడ జూన్ 2026లో పూర్తిస్థాయి వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. రెండు దేశాల మధ్య జరగబోయే ఈ పోరుపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>