Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌పై పోరు.. పాకిస్థాన్ అరుదైన రికార్డ్

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) లో భారత్‌తో జరుగుతున్న పోరులో పాకిస్థాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది. ఈ కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అరుదైన ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపిన పాక్, ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను రంగంలోకి దింపి చరిత్ర సృష్టించింది. మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, సల్మాన్ ఆఘాను బౌలింగ్‌కు ఉపయోగించింది.

టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) చరిత్రలో ఇలా ఒకే జట్టు ఆరుగురు స్పిన్నర్లను బరిలోకి దించడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఫుల్ మెంబర్ దేశాల్లో టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యధిక స్పిన్ ఆప్షన్ల వినియోగంగా నిలిచింది. పాకిస్థాన్ తరఫున పేసర్ షాహీన్ అఫ్రిది‌తో పాటు ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్‌ను జట్టులో ఉంచారు. అయితే షాహీన్ రెండు ఓవర్లు మాత్రమే వేసి 31 పరుగులు ఇచ్చారు. ఫహీమ్ అష్రఫ్‌ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. స్పిన్ విభాగంలో సైమ్ అయూబ్ మెరుగైన ప్రదర్శన చూపించారు. నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి పాక్ బౌలింగ్‌కు ప్రధాన బలంగా నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>