శాంతి చ‌ర్చ‌ల కోసం ఇస్లామాబాద్ రండి.. ఇరాన్‌, యూఎస్‌ల‌కు పాక్ ప్ర‌ధాని ఆహ్వానం!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌లో శాంతి కోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తికర పోస్ట్ చేశారు. ఇరాన్‌, అమెరికా ప్ర‌తినిధి బృందాలు ఏప్రిల్ 10న శాంతి చ‌ర్చ‌ల కోసం ఇస్లామాబాద్ (Islamabad) రావాల‌ని ఆహ్వానించారు. ఇస్లామాబాద్‌లో జ‌రిగే చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావాల‌ని, త్వ‌ర‌లో మ‌రిన్ని శుభ‌వార్త‌లు అంద‌రితో పంచుకోవాల‌ని ఆకాంక్షించారు. ఇప్ప‌టికే ఇరు దేశాల నాయ‌కులు శాంతి నెల‌కొల్పేందుకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో వ్య‌వ‌హ‌రించార‌ని కొనియాడారు.

యుద్ధానికి శాంతియుత ముగింపు ప‌లికేందుకు త‌మ‌ దౌత్య ప్రయత్నాలు అత్యంత పటిష్టంగా ముందుకు సాగుతున్నాయని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. త‌మ‌ దౌత్యం విజయవంత‌మ‌య్యేందుకు ఇరాన్‌పై దాడుల గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభ్యర్థించిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు తెరిచి ఉంచాలని ఇరాన్‌ను కోరిన‌ట్లు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం అన్ని పక్షాలు తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికా, ఇరాన్ తమ మిత్ర దేశాలతో కలిసి అన్ని చెట్ల‌ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. త్వ‌ర‌లో యుద్ధం శాశ్వ‌తంగా ముగిసి, శాంతి నెల‌కొల్పే అవ‌కాశం ఉంద‌ని ష‌రీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>