Mobile Popup Ad
Mobile Popup Ad

ORRపై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్ 16 వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే శనివారం ఔటర్ రింగ్ రోడ్డుపై మరో కారు ప్రమాదం (ORR Accident) జరిగింది.

తుక్కుగూడ సమీపం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర కారు టైర్ పేలి డివైడర్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి వేగమే కారణామా? టైర్ స్థితి బలహీనంగా ఉండటమా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.

Read Also: తెలంగాణలో బీజేపీ గెలవాలి.. అందుకే మోదీ వస్తున్నారు: ఈటల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>