Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి ఆప‌రేష‌న్ ముస్కాన్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఆప‌రేష‌న్ ముస్కాన్ (Operation Muskaan) కార్య‌క్ర‌మం ప్రారంంభం కానుంది. బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌, వీధి బాల‌లు, త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను చేర‌దీయ‌డం, బాల‌ల అక్ర‌మ ర‌వాణా నిర్మూల‌న‌ కోసం ఈ ఆప‌రేష‌న్‌ నిర్వ‌హిస్తున్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, ఇటుక బట్టీలు, హోటళ్ల వంటి రద్దీ ప్రదేశాలలో ముమ్మర తనిఖీలు నిర్వ‌హించి ఆయా చోట్ల చిక్కుకున్న‌ బాలలను రక్షించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మం కోసం పోలీస్ శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌, చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీలు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల బృందాలు క్షేత్ర‌స్థాయిలో రంగంలోకి దిగాయి. ర‌క్షించిన బాల‌ల‌ను వారి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించ‌డంతో పాటు వారికి పున‌రావాసం క‌ల్పించి విద్యావ‌కాశాలు క‌ల్పిస్తారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి చిన్న పిల్ల‌ల‌ను ప‌నిలో పెట్టుకొని హింసిస్తున్న వారిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>