Mobile Popup Ad
Mobile Popup Ad

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. నీటి లభ్యతపై చర్చ!

కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికిలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం అక్కడే సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశం కానున్నారు. హంద్రీనీవా నీళ్లతో అక్కడి ప్రాంత్రం వ్యవసాయానికి అనుకూలంగా మారింది. ఈ సందర్భంగా రైతులతో సీఎం మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. హంద్రీనీవా కాలువ విస్తరణ ద్వారా వచ్చే నీటి లభ్యతపై చర్చిస్తారు. రాష్ట్రంలో నీటి భద్రత, రిజర్వాయర్లలో నిల్వలు, భూగర్భ జలాలపై చర్చ ఉంటుంది. అటు సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను ఇచ్చేలా సీఎం మార్గదర్శనం చేయనున్నారు. అక్కడినుంచి బయల్దేరి వేములపాడులోని పెండేకల్లు జలాశయాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో హాఫ్‌మూన్ సాగు కార్యాచరణను పరిశీలించనున్నారు. అనంతరం వేములపాడులో తాడిపత్రి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి అమరావతికి బయల్దేరనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>