మేడారం హుండీ లెక్కింపు.. రెండోరోజు ఎన్ని కోట్లంటే..!

కలం, వరంగల్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం (Medaram Jatara)  సమ్మక్క-సారలమ్మ జాతరలో హుండీ ఆదాయం భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. హుండీ రెండో రోజు లెక్కింగా రూ. 3.54 కోట్ల ఆదాయం సమకూరింది. 160 హుండీ లను లెక్కించగా రూ. 3,54,25, 200 ఆదాయం సమకూరింది. నిన్నటి ఆదాయంతో కలుపుకొని రూ. 2.49, 65,000 కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం రూ. 6 కోట్ల 4 లక్షల 53 వేల 636 ఆదాయం వచ్చింది. ఇందులో రూ. 63,436 విదేశీ కరెన్సీ ఉండటం విశేషం.

మేడారం దర్శనానికి వచ్చే భక్తులు నగదు, బంగారం (Gold), వెండి కానుకలను అమ్మవార్తకు సమర్పించుకుంటారు. జాతర ముగిసిన అనంతరం దేవదాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య, సీసీ కెమెరాల నిఘాలో హుండీ లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు, జాతర నిర్వహణ పనులకు వినియోగిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>