Mobile Popup Ad
Mobile Popup Ad

ఆల‌యంలో చోరీ.. కోటి రూపాయ‌ల న‌గ‌లు మాయం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె (Madanapalle)లోని గోవర్ధ‌నగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీ చోరీ జ‌రిగింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత ఆల‌యంలో దొంగ‌లు ప‌డి న‌గ‌లు దోచుకెళ్లారు. ఆలయంలోని ప్రధాన ద్వారాలను పగలగొట్టి అమ్మవారి తాళిబొట్టు, అర్ఘ్య పత్రాలు, శంఖు చక్రాలు, షటగోపం, మూడు కిరీటాలు, స్వామివారి కన్నులు, పంచ పాత్రల‌ను ఎత్తుకెళ్లారు. అలాగే ఆల‌యంలో హుండీలను పెకలించి బయటకు తీసుకువెళ్లి అందులో ఉన్న న‌గ‌దు కూడా తీసుకెళ్లారు. దాదాపు కోటి రూపాయిలు విలువ చేసే బంగారు, వెండి అభ‌ర‌ణాలు చోరీకి గురైన‌ట్లు అర్చ‌కులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>