Mobile Popup Ad
Mobile Popup Ad

ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉందా? ఈ ఫేస్ ప్యాక్స్ మీకోసమే

కలం, వెబ్‌డెస్క్: కాలంతో సంబంధం లేకుండా యువతను వేధించే సమస్య ఆయిలీ స్కిన్. దీనివల్ల ఎంత మేకప్ వేసినా నిమిషాల్లో ఇట్టే చెరిగిపోతుంది. ఆయిలీ స్కిన్ (జిడ్డు చర్మం) అనేది చర్మంలోని సెబాషియస్ గ్రంథులు (Sebaceous glands) అవసరానికి మించి ‘సీబమ్’ అనే నూనెను ఉత్పత్తి చేయడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల ముఖం ఎప్పుడూ జిడ్డుగా మెరుస్తూ ఉంటుంది, అలాగే మోటిమలు (Acne), బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే జిడ్డు చర్మం సమస్యకు మన ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో (Oily Skin Remedies) చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

1. శనగపిండి ఫేస్ ప్యాక్

జిడ్డు చర్మాన్ని నియంత్రించడంలో శనగపిండి ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ జిడ్డు చర్మంతో పాటు నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది. దీనికోసం ఒక బౌల్‌లో 3 చెంచాల శనగపిండిని తీసుకోండి. దాంట్లో చిటికెడు పసుపు , మూడు చెంచాల పెరుగు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోని ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

2. అలోవెరా జెల్

చర్మ ఆరోగ్యానికి కలమంద జెల్ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత సాధారణ నీటితో కడిగితే చాలు. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి.

3. ముల్తానీ మట్టి

చర్మంపై ఉన్న అదనపు జిడ్డును పీల్చుకోవడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఈ ముల్తానీ మట్టిని చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. ఇందుకోసం కొద్దిగా ముల్తానీ మట్టిని తీసుకోవాలి. ఈ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్‌ చేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి ఆరిన కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ముఖంపై ఉన్న జడ్డు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది.

4. చందనం ఫేస్ ప్యాక్

జిడ్డు చర్మాన్ని సంరక్షించేందుకు చందనం పొడి ఫేస్ ప్యాక్ (Oily Skin Remedies) చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మానికి చలువ చేయడంతో పాటు గ్లో కూడా ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకునేందుకు చందనం పొడిలో రెండు చెంచాల పచ్చి పాలు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Read Also: పిల్లల కోపాన్ని మొండితనంగా భావిస్తున్నారా? 6 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>