Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ పెద్దమ్మ గుడి బోనాల ఉత్సవాలకు పూర్తి వసతులు

కలం, కరీంనగర్ బ్యూరో: గత 50 సంవత్సరాలుగా ఆరుద్ర చివరి పాదంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ముదిరాజుల ఆరాధ్య దైవం ‘పెద్దమ్మతల్లి బోనాల జాతర (Karimnagar Peddamma Bonalu)’ ఈ సంవత్సరం కూడా జులై 5, 2026 (ఆదివారం) ఘనంగా జరగనుంది. గత సంవత్సరాల తరహాలోనే ఈ ఏడాది కూడా నగరపాలక సంస్థ ద్వారా ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందించారు.

బోనాల (Peddamma Bonalu) పండుగను ఘనంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ పక్షాన పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల దాహార్తిని తీర్చేందుకు సురక్షితమైన త్రాగునీటి ఏర్పాటు చేయాలని.. ఎండ, వానల బారి నుండి భక్తులకు రక్షణ కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో టెంట్లు వేయడం, రాత్రి సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక విద్యుత్ దీపాల ఏర్పాటు, జాతర జరిగే రోజుల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా సౌకర్యాలను తప్పకుండా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలకాని నర్సయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజు ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు కుంభం రాజయ్య, ఏండ్ర శ్రీనివాస్, జెట్టి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ చేసిన సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>