కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలపై భారత్ (India) స్పందించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఏమాత్రం చట్ట ప్రకారం జరగడం లేదని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘పీవోకే సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలన్నీ భారత్ భూభాగం పరిధిలోనివే. పాకిస్థాన్ ఆక్రమించి, అక్కడి ప్రజలను వేధిస్తోంది’ అన్నారు.
ప్రజల హక్కులను కాలరాస్తూ..
పీవోకేలో జరుగుతున్న ఎన్నికలు ఏమాత్రం నిష్పక్షపాతంగా జరగడం లేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. పాకిస్థాన్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. పీవోకే ఆర్థిక వ్యవస్థను పాక్ గుప్పిట పట్టిందన్నారు. కనీసం అక్కడ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చకుండా, అధికార యంత్రాంగం ఉక్కుపాదంతో వారిని అణచివేస్తోందని మండిపడ్డారు.
Read Also: ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్
Follow Us On : WhatsApp

