కలం, నిజామాబాద్ బ్యూరో : జనగణన ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీయ గణన (Self Enumeration) కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్వీయ గణనను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ స్మార్ట్ ఫోన్‌ల ద్వారా https://se.census.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రతి నివాస ప్రాంతంలో స్వీయ గణనపై అవగాహన కల్పించి, ప్రతి కుటుంబం నమోదు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ నెల 26న ప్రారంభమైన స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, గడువులోగా ప్రజలు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.
Read Also: బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి వార్నింగ్
Follow Us On: WhatsApp

