Mobile Popup Ad
Mobile Popup Ad

మే 8న థియేటర్స్‌లో ‘ఏ ఫిల్మ్ బై గిరి’ విడుదల

కలం, వెబ్ డెస్క్: కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి మరో మూవీతో ముందుకొచ్చారు. స్టార్‌వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్ బ్యానర్‌లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ఎన్.సందేశ్ నిర్మించిన ‘ఏ ఫిల్మ్ బై గిరి (A Film by Giri)’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 8న థియేటర్లలో సందడి చేయనుంది. కాంతార సినిమా ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా.. రచన ఇందిర్ హీరోయిన్‌గా ఈ మూవీలో నటించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి కరణ్ అనంత్, అనిరుద్ మహేష్ దర్శకత్వం వహించారు. వీరు ఈ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయం కానున్నారు.
ఈ చిత్రాన్ని (A Film by Giri) రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం.అచ్చిబాబు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో ఎన్.పి తాపెశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించగా.. రఘునాథ్ సీఎం సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీకి భరత్ ఎంసి,  ప్రదీప్ అర్ రావు ఎడిటర్స్‌గా పనిచేశారు. సినిమాటోగ్రఫీని చంద్రశేఖరన్ & రంగనాథ్ చూసుకున్నారు.
బ్యానర్స్: స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, సందేశ్ ప్రొడక్షన్
సమర్పణ: అచ్చిబాబు ఎం
నిర్మాతలు: భీమవరపు సురేష్, ధన్యపర్తి ప్రశాంత్
దర్శకులు: కరణ్ ఆనంద్ & అనిరుద్ మహేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.వి.వి జష్ రాజ్
సినిమాటోగ్రఫీ: చంద్రశేఖరన్ & రంగనాథ్
మ్యూజిక్: వాసుకి వైభవ్
డిస్ట్రిబ్యూటర్: ఎంజి మూవీస్
Follow Us On: WhatsApp
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>