‘సర్’ వివాదం.. ఎన్నికల ప్రధాన అధికారి రాజీనామా?

కలం, వెబ్ డెస్క్: ఒడిశా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సీనియర్ ఐఏఎస్ సంతాన గోపాలన్ (Santhana Gopalan) వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షిస్తూ వస్తున్న గోపాలన్‌పై కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఉద్యోగానికి ముందస్తు రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకుంటున్నారు. 2001 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన గోపాలన్ స్వస్థలం తమిళనాడు. 18 నెలల సర్వీస్ ఇంకా మిగిలి ఉండగానే.. ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆయన దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

గోపాలన్ ఏమన్నారంటే..

ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల కారణంగానే తాను ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్లు గోపాలన్ వివరించారు. కుమారుడి స్కూలింగ్ పూర్తయ్యే వరకు ఒడిశాలోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. అయితే సర్ ప్రక్రియ పూర్తయిన వారం రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సెప్టెంబర్ 21న ఒడిశాలో 3.61 కోట్ల మందితో తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. సుమారు 17 లక్షల మంది ఓటర్లను గోపాలన్ తొలగించారని ప్రతిపక్ష బిజూ జనతా దళ్ ఆందోళనలు చేపడుతోంది.

మూడేళ్లలో అయిదుగురు రాజీనామా..

సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలన్ రాజీనామాతో ఒడిశాలో గత మూడేళ్లలో అయిదుగురు అధికారులు రాజీనామా చేసినట్లయింది. ఐఏఎస్ అధికారి వీకే.పాండియన్, అతడి భార్య సుజాత కార్తికేయన్ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి 2024లో రాజీనామా చేశారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి జగ్మోహన్ మీనా కార్పొరేట్ సంస్థలో చేరాలనే ఉద్దేశంతో గతేడాది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మరో ఐపీఎస్ అధికారి సీఏ రాందాస్ పోలీస్ అకాడమీలో వృత్తి శిక్షణలో ఉండగానే రాజీనామా చేశారు. తాజాగా, గోపాలన్ కూడా వారి జాబితాలో చేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>