పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి: నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) అర్హులైన పట్టభద్రులు బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. గురువారం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించి ఆర్డీవో సుబ్రమణ్యానికి ఆయన దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదన్నారు.

అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని (Niranjan Reddy) సూచించారు. క్వాలిఫైయింగ్‌ తేదీకి కనీసం మూడేళ్ల ముందు డిగ్రీ లేదా సమాన అర్హత పొందిన పట్టభద్రులు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదుకు అర్హులు. అర్హులైన వారు ఫారం–18 ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్న యాదవ్, గౌడ్ నాయక్, స్టార్ రహీం, సయ్యద్ జమీల్, మంద రాము తదితరులు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>