హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం: ఓసీ జేఏసీ

కలం, కరీంనగర్: ఇచ్చిన హామీల అమలుకు వచ్చే నెల 8న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దీక్షలో ఓసీ జేఏసీ (OC JAC) ఆధ్వర్యంలో సంఘీభావంగా పాల్గొని తాము మద్దతు తెలుపుతున్నట్లు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఆదివారం కరీంనగర్ లో శ్రీనివాస్ హోటల్ లో ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఐకాస నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు నిధులు కేటాయించ లేదని అన్నారు. పాలక వర్గాన్ని ప్రకటించలేదని, ఇతర ఓసీల కార్పొరేషన్ లకు సైతం పూర్తిస్థాయి పాలక వర్గాలను ఏర్పాటు చేయలేదని నిధులు కేటాయించలేదని చెప్పారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్ కు రూ.వేయి కోట్ల నిదులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు.
ఇతర ఓసీ లకార్పొరేషన్ లకు పూర్తి స్థాయి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించి, అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగులో ఉన్న 12 వేల కోట్ల విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని, రైతు భీమాను కొనసాగించాలని రామారావు డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధనకు వచ్చే నెల 8న రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో ఇందిరా పార్కు వద్ద చేపట్టే ఓసీల నిరసన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓసీ కదలి వచ్చి విజయవంతం చేయాలని.. ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండ గట్టాలని రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరి మని శంకర్ రెడ్డి, అండెం రమణా రెడ్డి, రూప్ రెడ్డి సత్య నారాయణ రెడ్డి, తోపు చర్ల శ్రీనివాస్ రావు, కొత్త కొండ రవీందర్ రావు, తాటి పల్లి రాజన్న, కంకణాల రాజి రెడ్డి, గన్ను నరసింహా రెడ్డి, వెలమ రఘుపతిరెడ్డి ఉమ్మడి జిల్లా నాయకులు. తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>